Thursday, December 21, 2006

సిరివెన్నెల ఆశావాదం-24

వెతికే మజిలి దొరికేదాక
కష్టాలు నష్టాలు యెన్నొచ్చిన క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెనా
బెదురంటు లేని మది యెదురుతిర్గి అడిగేనా
బదులంటు లేని ప్రశ్న లేదు లోకానా
నీ శోకమె శ్లోకమై పలికించర మనిషీ

Wednesday, December 20, 2006

సిరివెన్నెల ఆశావాదం-23

అలుపన్నది ఉందా యెగిరె అలకు యెదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు

Friday, December 15, 2006

సిరివెన్నెల ఆశావాదం-22

తికమక మకతిక పరుగులు యెటుకేసి
నడవరా నరవ నలుగురితో కలిసి
శ్రీ రామ చందురున్ని కోవెల్లొ ఖైదు చేసి
రాకాసి రావనున్ని గుండెల్లొ కొలువు చేసి
తల తిక్కల భక్తితో తైతక్కల మనిషీ !!!

Thursday, December 14, 2006

సిరివెన్నెల ఆశావాదం-21

యెవరైన చూసరా యెప్పుడైనా
ఉదయాన కురిసే వన్నెల వాన
కరి మబ్బులాంటి నడి రేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒకొక తార చినుకల్లె జారి వెలిసింది తొలి కంతిగా

Wednesday, December 13, 2006

సిరివెన్నెల ఆశావాదం-20

వేకువనే మురిపించే ఆశలు
వేను వెంటే అంత నిట్టూర్పులు
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటె చూపాలా కన్నులు
ఇలాగేన ప్రతి రోజు
ఎలాగైన ఏదో రోజు మనదై రాదా

Tuesday, December 12, 2006

సిరివెన్నెల ఆశావాదం-19

సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని
చికటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని

ఎన్ని అందాలు స్వాగతిస్తూ కళ్ళముందుండగా
అందుకొకుండా ఆగిపొతూ ఊసూరుమంటే ఎలా

ఈ ఉడుకు..ఈ దుడుకు ..ఈ వెనక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకు..ఈ వయస్సునిలాగే కరిగిపొనీకు

Monday, December 11, 2006

సిరివెన్నెల ఆశావాదం-18

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే కద గుండె బలం తెలిసేది
దుఖానికి తలవంచితె తెలివికింక విలువేది

Sunday, December 10, 2006

సిరివెన్నెల ఆశావాదం-17

కొంత కాలం నేల కొచ్చాం..అతిధులై ఉండివెళ్ళక
కోటలైన,కొండలైన ఏవి స్థిరాస్తి కాదుగా

కాస్త స్నెహం..కాస్త సహనం
పంచుకొవచ్చు హాయిగా
అంతకన్న సొంతమంటూ ప్రపంచ పటాన లేదుగా

Saturday, December 9, 2006

సిరివెన్నెల ఆశావాదం-16

మనసు కాస్త కలత పడితె మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనుల నీరు తుడుచు వారు ఎవరు లెరని చితి ఒడి చెరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి
నూరెళ్ళు నుండుగా జీవించమన్నది

ఈ పాటకు శ్రీ సిరివెన్నెలగారికి రాష్ట్ర నంది బహుమతి లబించింది. సినిమా అంత విజయవంతం కాకపొవదం వల్ల ఈ పాట గురించి జనావళికి పెద్దగ తెలియకుండా పొయింది. ఈ పాట పాడినది శ్రీ ఎసుదస్ గారు మరియు సంగితం అందించింది శ్రీ ఇళయరాజా గారు.

Monday, December 4, 2006

సిరివెన్నెల ఆశావాదం-15

జగాలేలు జాబిల్లి మహా ఒంటివాడు
తన అనే తొడేది సమిపాన లేదు
ఎదను రగిలె వేడున్నా వెలికి తెలియనీడు
జనులు నిదురపొతున్నా అలగి తొలగిపోడు
సుధాకాంతి పంచే విధి మానుకోడు
యధాశక్తి చూపే కళను దాచుకోడు

Sunday, December 3, 2006

సిరివెన్నెల ఆశావాదం-14

జరిగింది ఓ ప్రమాదం.. ఏముంది నీ ప్రమేయం
దేహానికైన గాయం..ఏ మందుతొనొ మాయం
విలువైన నిండు ప్రాణం..మిగిలుండడం ప్రధానం
అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం

Saturday, December 2, 2006

సిరివెన్నెల ఆశావాదం-13

చెదరకపొదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్నికాంతికి
దానికి లెక్కలేదు కాళరాతిరి

పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యొతిని
రెప్ప వెనుక ఆపని కంటి నీటిని

సాగలేక అగితే దారి తరుగునా?
జాలి చూపి తీరమే దరికి చెరునా

Friday, December 1, 2006

సిరివెన్నెల ఆశావాదం-12

వేసిన అడుగులు గోతులలో పడదోసినా
తీసిన పరుగులు నీ ఎముకులు విరిచేసినా

అమ్మయ్య అనుకొని ఆనందించు
అద్రుష్టం కనకనే బ్రతికానంటూ

మాడు పగిలే కీడు తగిలినా..ఆయువుంది నయమేగా

Thursday, November 30, 2006

సిరివెన్నెల ఆశావాదం-11

ఏనాడొ చెప్పినది..ఏనాడు మారనిది
శ్రీ క్రిష్ణుడి గీతాసారమిది..

యుద్ధం మొదలవనిదే..
ప్రశ్నిస్తూ కూర్చుంటే...
అపజయమే బదులై వస్తుంది

Wednesday, November 29, 2006

సిరివెన్నెల ఆశావాదం-10

అడుగు అడుగునా అగ్నిపధం..
పద పదమన్నది పదం పదం

బ్రతకడం అంటే అర్ధం...
అనుక్షణం జరిగే యుద్ధం

Tuesday, November 28, 2006

సిరివెన్నెల ఆశావాదం-9

మనిషి భయపడాలి తప్పు పనులకి
భయము భయపడాలి మనిషి మంచికి

Monday, November 27, 2006

సిరివెన్నెల ఆశావాదం-8

ఒరిమి వలలొ ఒదిగి ఉన్నదిరా
భారత వీరుల ఖడ్గం

కొరి కొరి కవ్వించే వైరుల
కుత్తుక కొరికే వ్యాఘ్రం

ప్రపంచ శాంతికి ప్రమాదమొస్తే
సహించబొదు ఈ ఖడ్గం

ఆత్మగౌరవం భంగపడితె
మరి ఆదమరపుగ ఉండని సంఘం

అంతకలహలన్ని మరిచి
విరుచుకుపడె సమైక్య శక్తుల ఖడ్గం

మనిషిని మనీషికి దగ్గర చెసే
స్నెహ సంభంధాల సంసర్గం
అంతరాలను ఆవాంతరలను చెధించే ఖడ్గం


ఈ ఆశావాదం జీవితానికి, వ్యక్తిత్వానికి సంభంధించినది కాదు. ఇది భారతదేశానికి గురించి చెప్పినది. భారతదేశంలో కులమత విభేదాలు, వైషమ్యాలు ఎన్ని ఉన్నా ఆపద వచ్చినపుడు వంద కోట్ల బారతీయులు ఒక్క తిరుగులేని శక్తిగా మారతారని కవి భావన.

సిరివెన్నెల ఆశావాదం-7

వెక్కి వెక్కి ఏడ్చే కన్నిళ్ళె ఉప్పన
క్కుమన్న నవ్వే ఓ తేనె ఉప్పెన

మావిపళ్ళు ఇవ్వదా మండు వేసవి
పైరు పాట పాడదా వాన పల్లవి

Sunday, November 26, 2006

సిరివెన్నెల ఆశావాదం-6


పండుగ ఎప్పుడు అంటే..ఫలనా రోజు అంటే
తక్కిన రొజులన్ని..బరువుగా మొస్తున్నామంతే

బంధువులు ఎవరంటే..ఫలనా వారంటే
పక్కన ఎందరు వున్నా...ఒంటరి వాళ్ళమైనంటే...

పంచాంగం చూస్తేగాని..పండుగ రానందా?
మంచి ముహుర్తం కాదు అని గుండె సవ్వడి ఆగిందా

సిరివెన్నెల ఆశావాదం-5


బాధ లేని ఏ బంధమైనా బిగువు లేనిధి
పోరు లేని ఏ విజయమైనా విలువ లేనిధి

ఉరుము లేని ఏ మెఘమైనా చినుకు లేనిధి
మరిగిపోని ఏ లొహమైనా పనికి రానిది.

సిరివెన్నెల ఆశావాదం-4

సంతోషం సగం బలం...హాయిగ నవ్వమ్మ
ఆ సంతోషం నీ తొడై..సాగవె గువ్వమ్మ

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా

చుట్టమలె కష్టమొస్తే...కళ్ల నీరు పెట్టుకుంటూ
కాళ్లు కడిగి స్వాగతించకు
ఒక చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేని పోని సేవ చెయ్యకు

మిణుగురులా మిల మిల మెరిసిన చాలు కదా
ముసురుకొనే నిశి విల విలలాడుతూ పరుగులు తీయదా

సిరివెన్నెల ఆశావాదం-3


ఎవరో ఒకరు...ఎప్పుడొ అప్పుడు
నడువరా ముందుగా..అటో ఇటో ఎటోవైపు

మొదటి వాడు..ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు..ఎప్పుడు ఒంటరే మరి
వెనుక వచ్చు వాలకు బాట అయ్యినది

సిరివెన్నెల ఆశావాదం-2

ఒకటి రెండు అంటూ ..విడిగా లెక్కడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు...ఆంకెలు ఎన్నంటే

పక్కన నిలబెడుతూ...కలుపుకు పొతూవుంటే
ఆంకెలకైనా అందవు....సంఖ్యలు ఎన్నంటే

నువ్వు నువ్వుగా..నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒక్కట్లై...ఒంటరితనాన పడివున్నామంతే

నిన్ను నన్ను కలిపి మనం అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే "మనిషితనం" ఒకటే

సిరివెన్నెల ఆశావాదం-1



నోప్పి లేని నిమషమేది..జననమైనా మరణమైనా
జీవితాన అడుగడునా

నీరసించి నిలిచిపొతే నిమషమైనా నీది కాదు

బ్రతుకు అంటె నిత్య ఘర్షణ

దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తువుంది

ఇంతకన్నా సైన్యముండునా?

ఆశ నీకు అస్త్రమవును..శ్వాస నీకు సస్త్రమవును

దీక్ష కన్నా సారధి ఎవరురా?